Nov 13,2023 18:41

అనగనగా ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారి పేర్లు కాగితం, కొబ్బరి ఆకు, ప్లాస్టిక్‌. ఒకరోజు వాళ్ళు ముగ్గురూ కలుసుకున్నారు. వాళ్ళు ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు.
కాగితం అంటోంది.. నన్ను సరస్వతీ దేవి దీవించడం వలన నన్ను పుస్తకంలో పెట్టి పెద్దపెద్ద చదువులు చదువుకుంటారు.
కొబ్బరి ఆకు నన్ను చీపురుగా చేసి ఇంటిని శుభ్రపరుచుకుంటారు. ఇప్పుడు కొత్తగా కొబ్బరి పీచుతో వాహనాలు మెత్తగా ఉండడానికి వాడతారు. ప్లాస్టిక్‌ ఇప్పుడు నీవంతు.
నేను ఏమి చెప్పాలి. నావలన ముందు వచ్చే కాలం గురించి మనుషులు ఆలోచించడం లేదు. నన్ను ఎన్నో కెమికల్స్‌తో తయారు చేస్తారు. నన్ను వాడిన వారికి ఎన్నో జబ్బులు వస్తాయి. కొన్ని జంతువులు తలెయకుండా తినేస్తాయి. అప్పుడు అవి అనారోగ్యం పాలవుతాయి. ముందు వచ్చే కాలంలో భూమి మొత్తం అంతరించి పోతుంది. ఎందుకంటే నన్ను తెలియకుండా ఎక్కడంటే అక్కడ పారేస్తారు. దానివల్ల అక్కడ నివసించే వారికి చాలా ఇబ్బందులు వస్తాయి. నన్ను కాల్చడం వలన విచిత్రంగా వాసన వస్తుంది. అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. ఈ మనుషులు ఏది ఏమైనా నన్ను కచ్చితంగా వాడతారు. వారికి తెలుసు. అయినా కానీ వాడతారు. అందుకే డాక్టర్లు ప్లాస్టిక్‌ వాటిలో ఆహార పదార్ధాలు తినకూడదు. ప్లాస్టిక్‌ ఎన్ని సంవత్సరాలైనా భూమిలో కలవదు. కానీ కాగితం మూడు రోజుల్లో భూమిలో కలిసిపోతుంది. అందుకే ప్లాస్టిక్‌ని దూరం పెట్టండి.


టి. వైష్ణవి
6వ తరగతి, విజరు హైస్కూల్‌, నిజామాబాద్‌, తెలంగాణ.