ప్రజాశక్తి-అమరావతి : దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత కార్మిక కర్షక పీడిత వర్గాల ఆశాజ్యోతి పుచ్చలపల్లి సుందరయ్య 38వ వర్ధంతి సభ అమరావతి సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి బి సూరిబాబు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య తన జీవితాంతం కార్మిక రైతాంగ సమస్యల కోసం సిపిఎం అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులని అన్నారు. భారతదేశంలో ఆర్థిక అసమానతలేని సమ సమాజం మార్పు కోసం దోపిడీ లేని వర్గాన్ని సోషలిస్టు సమాజంలోనే మానవజాతికి కూడు గుడ్డ విద్య వైద్యం ప్రభుత్వ ఆధీనములో ప్రజలు సౌకర్యవంతమైన అనుభవించగలరని కోరారు. తన సొంత గ్రామంలో అంటరానితనానికి దళితుల పక్షాన భూస్వాములకు వ్యతిరేకంగా పనిచేశారని తన యావదాస్తిని పార్టీ కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టారని అన్నారు. ప్రజా సేవకు బిడ్డలు అడ్డం వస్తారని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న ఆదర్శమైన సుందరయ్య లీలావతి దంపతులను అన్నారు. నేడు దేశంలో అవినీతి అక్రమాలు పెట్టుబడుదారులకు అనుకూలమైన సంపద పోగు చేసుకోవటానికి బిజెపి విధానాలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. కార్మిక కర్షకులు హక్కులు కాలరాస్తున్నారని మరోపక్క కులతత్వము మతతత్వం విభజించి అధికారాలను కాపాడుకోవాలని పాలక ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. సుందరయ్య నిస్వార్థ, మచ్చలేని విప్లవ కమ్యూనిస్టు నేతని కొనియాడారు. తెలంగాణ నైజాం పాలనకు వ్యతిరేకంగా సుందరయ్య నాయకత్వన భూమికోసం భుక్తి కోసం సాయుధ పోరాటం నిర్వహించి నాలుగు వేల అమరవీరులు త్యాగమూర్తులతోటి 10 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేయటమే కాకుండా తెలంగాణ నైజాం భారత సైన్యములో విలీనం చేయటం కోసం సాయుధ పోరాటం చేశారని అన్నారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శృంగారపాటి రాజ్ కుమార్, నాగులమీరా, కరీం, టి.సుబ్బారావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు










