- ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ బ్రిడ్జిని నిర్మించాలి
- నినాదాలు చేస్తూ పనులను అడ్డుకున్న నన్నూరు గ్రామ ప్రజలు
ప్రజాశక్తి-కర్నూలు హాస్పిటల్ : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ హైవే ఫుట్వే బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేయాలని ఆ గ్రామస్తులు జాతీయ రహదారిని ముట్టడించి పనులను నిలిపివేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న గ్రామస్తులు విజయ్ శంషుద్దీన్ కాజా హుస్సేన్ రైతు సంఘం మండల నాయకులు మధుసూదన్ మాట్లాడారు. జాతీయ రహదారి పైన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని గత అనేక సంవత్సరాలుగా కోరుచున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు అన్నారు. ఈ గ్రామాన్ని ఆ నుకొని లొద్దిపల్లె ,మీదివేముల, బైరాపురం, ఉయ్యాలవాడ ఉప్పలపాడు కలుగొట్ల బుక్కాపురం గ్రామాల ప్రజలు నిరంతరం మండల కేంద్రానికి జిల్లా కేంద్రానికి తమ తమ పనుల నిమిత్తం వేలాదిమంది వెళుతుంటారని, వీరందరూ తమ గ్రామాలకు తిరిగి వచ్చేదాకా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సి ఉందని అన్నారు. ఏ వాహనం ఎటునుంటి వచ్చి ఢీకొడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నన్నూరు గ్రామ విద్యార్థులు వందలాది మంది హైస్కూలు రహదారి అవతల వైపు ఉండడంతో రోడ్డు దాటుతూ వస్తూ ఉండాలి వీరి తల్లిదండ్రులు విద్యార్థులు బడి అయిపోయి ఇంటికి వచ్చేదాకా ఆందోళనతో ఉండే పరిస్థితి ఉంటుందని అన్నారు. అయినా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు కానీ నాలుగు రోజుల నుండి ఫుట్వ బ్రిడ్జిల వల్ల ప్రజలకు విద్యార్థులకు కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదని పిల్లలు ఎనిమిది పది కిలోల బ్యాగులు వేసుకొని ఎక్కే పరిస్థితి లేదని వృద్ధులు మోకాళ్ళ నొప్పులతో ఎక్కే పరిస్థితి లేదని కోటి 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ఉపయోగం లేదని అన్నారు. గతంలో అనేకసార్లు చెప్పినా మళ్లీ అదే పనులను ప్రారంభించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు ఫుట్వే బ్రిడ్జిలు కర్నూల్లో జనరల్ హాస్పిటల్ మరియు కొత్త బస్టాండ్ వద్ద నిర్మాణం చేపట్టారు ఆ బ్రిడ్జిలు ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉండి తాగుబోతులకు ఆసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి ఇక్కడ నిర్మించినా అదే దుస్థితి నెలకొని ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారని అన్నారు కనుక తక్షణమే ఫుట్వే బ్రిడ్జి నిర్మాణ పనులను నిలిపివేసి హైవే పైన ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేశారు అనంతరం ఓర్వకల్లు ఎస్సై మల్లికార్జున సిబ్బంది తాసిల్దార్ శివప్రసాద్ రెడ్డిని పిలిపించారు ఆయన ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నన్నూరు గ్రామ ప్రజలు మాసుం భాష మల్లేష్ బషీర్ రాజేష్ ఆంజనేయులు దస్తగిరి సిద్దయ్య బుజ్జన్న మధు రోశన్న పాల్గొన్నారు










