May 03,2023 12:58

ప్రజాశక్తి-మంగళగిరి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేటికరించడానికి వ్యతిరేకిస్తూ సిపిఎం, సిపిఐ, టిడిపి, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. తొలుత ఆయా పార్టీల కార్యాలయం నుండి ప్రదర్శనగా అంబేద్కర్ సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ధర్నా కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చేంగాయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం హనుమంతరావు, సిపిఐ నియోజకవర్ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు, టిడిపి నాయకులు వాదం మాధవరావు మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగిందని వివరించారు. లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఫ్యాక్టరీని వేల కోట్ల రూపాయలకు కారు సౌకగా పెట్టుకోదారులకు అమ్మడానికి మోడీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. కొంతమంది ప్రాణాల త్యాగాలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సాధించడం జరిగిందని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ సమైక్యంగా ఉండి త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, పట్టణ నాయకులు ఎస్ గణేష్, బి స్వామినాథ్, టి హేమసుందర్ రావ్, సిపిఐ నాయకులు వై వెంకటేశ్వరరావు, జాలాది జాన్ బాబు, ఏ ప్రభాకర్, పి నాగేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు చిన్ని సత్యనారాయణ, టిడిపి నాయకులు గోవాడ దుర్గారావు, సింహాద్రి రామారావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.