- కేంద్రకార్మిక సంఘాల విమర్శ
ప్రజాశక్తి-కాకినాడ : నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ ఎన్ ఎఫ్ పి ఈ గుర్తింపును పునరుద్ధరించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఉద్యోగులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 13 లక్షల పోస్టులు తక్షణమే నిరుద్యోగులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఐ.ఎన్.టి.యు.సి ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆదినారాయణమూర్తి, టిఎన్టియుసి నాయకులు కర్రీ రాజారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదల చిన్న మొత్తాల పొదుపుకు భద్రత అందిస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా ఎన్ ఎఫ్ పి ఈ అడ్డుపడుతుందనే కారణంతో 70 శాతం సభ్యత్వం కలిగిన గుర్తింపు సంఘాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసిందని విమర్శించారు. మూడు శాతం సభ్యులు మాత్రమే ఉన్న, ప్రైవేటీకరణ అనుకూల సంఘం అయిన బిఎంఎస్ కు గుర్తింపు ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఈ బిజెపి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పనిగంటలను 8 గంటల నుండి 12 గంటలకు మార్చుకోవచ్చని కార్మిక చట్టాలను సవరణలు చేస్తుంటే ఈ ప్రభుత్వ అనుకూల బిఎంఎస్ నోరు మెదపకుండా కార్మికులకు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడుస్తూ సవరణలకు మద్దతు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. ఒకపక్క దేశంలో ఎన్నడూ లేనంతగా చదువుకున్న యువతలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే, మరో పక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 13 లక్షల పోస్టులను భర్తీ చేయకుండా ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థను మోడీ ప్రభుత్వం అమ్ముకుంటూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. దేశంలో పన్నులు చెల్లించగలిగే మధ్యతరగతి ప్రజలలో రెండు కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వీరు చెల్లించే పనులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందని అలాంటి ఉద్యోగులను గౌరవించాల్సింది పోయి, ఉద్యోగసంఘాల గుర్తింపును రద్దు చేయడం తగదని, కార్మిక, ఉద్యోగ, రైతాంగ వ్యతిరేకతను బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే ఎన్.ఎఫ్.పి.ఇ గుర్తింపును పునరుద్ధరించాలని లేనిపక్షంలో మధ్యతరగతి ఉద్యోగులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, ఏ.పీ.ఎం.ఎస్.ఆర్.యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, అయ్యప్ప, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ నాయకులు సూరిబాబు, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు దినేష్, ఐ.ఎన్.టి.యు.సి జిల్లా ఉపాద్యక్షురాలు కె.రమాదేవి, వెంకటేశ్వరరావు, మహిళ సంఘం నాయకులు జి.మంగా, కె.భవాని, రామలక్ష్మి, టి.ఎన్.టి.యు.సి నాయకులు బలగం పరశురాం, కోలా ఎల్లారావు, మల్లాడి గంగాధర్, ఐ.ఎఫ్.టి.యు నాయకులు జి.దుర్గారావు, మల్లవారపు రాజు, కె.నరసింహ తదితరులు పాల్గొ










