ప్రజాశక్తి-కరప : కరప మండల అంబేడ్కర్ యువజన సేవా సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడికి నిరసనగా కరపలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక పిహెచ్సి ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబెడ్కర్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు చిన్నం వెంకటేశ్వరరావు, వేలంగి గ్రామ సర్పంచ్ సవిలే నీలిమరాజేష్, ఆశా వర్కర్స్ సంఘం నాయకులు రెడ్డి వెంకటలక్ష్మి, దళిత నాయకులు సాదేలోహిదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విగ్రహం వద్ద నుండి కరప పోలీసు స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి, కరప ఎస్సై, కరప తహశీల్దార్ కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు సవిలే రాజేష్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడి, యావత్తు దేశంపై జరిగిన దాడి అన్నారు. స్త్రీలను నగ్నంగా ఊరేగించడం ఏ దేశ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు. యిప్పటికే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో ఆలస్యం చేసిందన్నారు. ఇప్పటికై పరిస్థితులను అదుపు చేయాలని ఆయన కేంద్రప్రభుత్వమును కోరారు. అంబేడ్కర్ యువజన సేవా సంఘం అధ్యక్షుడు చిన్నం వేంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ మణిపూర్ సి.ఎమ్. రాజీనామా చేయాలన్నారు. దోషులందరిని కఠినంగా శిక్షించాలన్నారు. కరపమండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు ఎమ్.రాజ్ కుమార్ మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో శాంతికరమైన వాతావరణం నెలకొనేలా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో అంబేడ్కర్ యువజన సేవా సంఘం ఉపాధ్యక్షుడు మూరా అవినాష్, సెక్రెటరీ మాతా అప్పారావు, మహిళా సంఘం నాయకులు సాధనాల పద్మావతి, మండల దళిత నాయకులు సాదే వీర రాఘవులు, రొక్కల నూకరాజు, మారేళ్ళ వెంకట రమణ, పులపకుర శుభమహేశ్వరరావు, వింత సురేష్, దాలిపర్తి శ్రీనివాసరావు, ఉబా ఏడుకొండలు, యలమంచిలి సుకుమార్, చాట్రా శ్రీనివాస్, యూత్ గుబ్బల రామకృష్ణ, మారేళ్ళ సిద్ధూ, పోట్లకాయల నానిబాబు, గుత్తాల ధ్రువకుమార్ మరియు ఎనిమేటర్స్, ఆశావర్కర్లు, పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.










