Jul 26,2023 16:28

ప్రజాశక్తి-క్రోసూరు : మండపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు & అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లును అరికట్టాలని ప్లే కార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఎం మండల కార్యదర్శి తిమిశెట్టి హనుమంతరావు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లకు అక్కడ అధికార బిజెపి పార్టీ రాజకీయ అవకాశవాదమే కారణమని, వీరి అవకాశవాద రాజకీయం వలనే అక్కడ ప్రజలు భారీగా నష్టపోయారని ఇప్పటికైనా  కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు పారదర్శకంగా చర్యలు తీసుకోని అల్లర్లను అదుపులోకి తీసుకురావాలని అన్నారు. అక్కడ జరిగిన అల్లర్లకు దాదాపు 60 వేల మంది కుకీలు నిరాశ్రయులయ్యారని, అక్కడ మహిళల మీద జరిగిన దారుణమైన ఘటన చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తే గాని నరేంద్ర మోడీ స్పందించలేదని, ఇంత అవకాశవాదంగా భారతదేశంలో మునుపెన్నడూ ఏ ప్రధాని వ్యవహరించలేదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనని అన్నారు. మణిపూర్ రాష్ట్రానికి 371వ అధికరణ ప్రకారం అడవుల్లో నివసిస్తున్నటువంటి ఎస్టీలకు సంబంధించి కుకీలకు ప్రత్యేక చట్టాల ద్వారా రక్షణ కల్పించడం జరుగుతుందని, అడవుల్లోని ఖనిజ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి కాశ్మీరు లాగానే వారికి కొన్ని అడ్డంకులు వస్తున్నాయని, వారి హక్కులను పూర్తిగా కాలరాయడానికి ఈ అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని ఈ రాజకీయ అవకాశవాదాన్ని దేశ ప్రజలందరూ జాగ్రత్తగా గమనించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్పీ నియోజకవర్గ నాయకులు గనుపల్లి శేఖర్ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో గతంలో గుజరాత్ లో కూడా ఇదే తరహా గొడవలు జరిగాయని & ప్రస్తుతం మణిపూర్ లో కూడా అదే పద్ధతులులో రెండు జాతుల మధ్య తగాధలను ప్రోత్సహిస్తూ తన అధికారాన్ని సుస్థిరపరచుకోవడానికి చూస్తున్నదని అన్నారు. వాస్తవానికి అక్కడ మెజారిటీగా ఉన్న మైథిలిలను బీసీ నుండి ఎస్టీ జాబితాలోకి చేరుస్తానని అక్కడ రాష్ట్రంలో అధికారులు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపద్యంలో అక్కడ అప్పటికే ఎస్టీలు గా చలామణి అవుతున్నటువంటి కుకీలకు తమ హక్కులు ఎక్కడ కోల్పోతామోనని భయంతో ఆందోళన మొదలైందని అన్నారు. ఈ ఆందోళనను తగ్గించడంలో ఎక్కడ కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన పద్ధతిలో చర్యలు తీసుకోలేదని, పైగా మెజారిటీగా ఉన్నటువంటి మైథిలకు బిజెపి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించడం వలనే అక్కడ కుకీల మీద & ముఖ్యంగా మహిళల మీద దాడులు జరిగాయని, అదే సందర్భంలో కుకీలలో ఎక్కువమంది క్రిస్టియానిటీ మతంలో ఉన్న నేపథ్యంలో చర్చిల మీద కూడా దాడులకు తెగపడ్డారని అన్నారు. అక్కడ ఆడపిల్లను మానభంగం చేసి, అడ్డొచ్చిన కుటుంబ సభ్యుల్ని నరికి చంపినప్పటికీ అక్కడ మీడియా స్పందించకుండా & మౌనంగా ఉండటం అత్యంత ప్రమాదకరమైన అంశం అని, మరొక ప్రక్క అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి ఇంటికి ఎవరో నిప్పంటించారని అది జాతీయస్థాయి మీడియాలో ప్రత్యేకంగా పబ్లిసిటీ చేయటం అత్యంత అవకాశవాద & హేయమైన మీడియా చర్య అని అన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు దాసు మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతదేశంలోని ప్రజలందరికీ మత స్వేచ్ఛనిచ్చిందని, ఒకరిని ఒకరు చంపుకోమని ఏ మతం చెప్పదని, బిజెపి అవకాశవాద విధానాలను సరైన పద్ధతిలో ఎదుర్కోవాలని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యులు చిల్కా ప్రభాకరరావు మాట్లాడుతూ దేశంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మతాలకు, కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించాలని, ఇలాంటి నిరసన కార్యక్రమాలలో కూడా అందరూ కలిసి రావాలని అప్పుడే ఇలాంటి ఘటనలు పనరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. టిడిపి క్రోసూరు టౌన్ యూత్ ప్రెసిడెంట్ మల్లాల రామాంజనేయులు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు భారతదేశాన్ని అప్రతిష్ట పౌలు చేస్తాయని, ఇలాంటి ఘటనలను బీసీ సంఘాల బాధ్యులుగా కూడా ఖండిస్తున్నామని , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి ఘటనలను వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం క్రోసూరు గ్రామ కార్యదర్శి చిల్కా ఏషియా,  తెలుగుదేశం పార్టీ నాయకులు దుద్దులు యోహాన, ఊరే రోశయ్య,, మొగల్ జాన్ , మహిళా సంఘం మండల కమిటీ సభ్యులు తిమ్మిశెట్టి విజయ కుమారి, sk.శుక్రాభి, దుద్దుల స్వప్న, మాజీ ఎంపీటీసీ కొజ్జా రామాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గంటెల చిన్నప్ప, భవన నిర్మాణ కార్మికులు దుద్దుల ఇశ్రాయేలు, ch.సురేంద్ర, నాగమల్లి, డివైఎఫ్ఐ కమిటీ సభ్యులు t.ఉదయ భాస్కర్, p.రాజు సిఐటియు మండల కార్యదర్శి d.మురళి, ch.రమేష్ తదితరులు పాల్గొన్నారు.