- చనుమోలు సైదులు
ప్రజాశక్తి-చందర్లపాడు: ప్రజాసంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ గోడపత్రికను చందర్లపాడు సెంటర్ నందు ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 65% ప్రజలపై ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు అప్పచేసేందుకు తెచ్చిన మూడు నల్ల చట్టాలను విద్యుత్తు బిల్లలు రద్దుకై రైతులు సంవత్సరం పైగా నడిపిన చారిత్రాత్మక ఉద్యమానికి తలగిన ప్రభుత్వం చట్టాలు రద్దు ప్రకటించింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సంపదనంత పెట్టుబడిదారులు కార్పొరేట్లకు దోచిపెట్టింది దేశ ప్రజలు కూడబెట్టుకున్న ప్రభుత్వ రంగ ఆస్తులను తగనంపుకుంటుంది కార్మికులు హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోళ్లను తెచ్చి కార్మికుల రక్త మాంసాలను రైతుల హక్కులను చట్టాలను నిర్వీర్యం చేస్తుంది అన్నారు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు కల్పించి రోజుకు 600 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని రైతులకు ఇచ్చే వ్యవసాయ పరికరాల మీద జిఎస్టిని ఎత్తివేయాలని పెట్రోల్ డీజిల్ గ్యాస్ పై సంకలు తగ్గించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేల్పుల ఏసోబు, తోటరామారావు, ఉద్దండు తదితరులు పాల్గొన్నారు.










