Jun 18,2023 15:24
  •  ఘనంగా సత్కారాలు

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్ : సామర్లకోట రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న 6 గురు సిబ్బందికి (పాయింట్స్ మన్ లకు)  60% ప్రమోషన్ కోటాలో రైల్వే గూడ్స్ గార్డ్ లుగా పదోన్నతులు కల్పించడంతో వారిని ఆదివారం  రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. అలాగే వారికి 50 రోజుల ట్రైనింగ్ నిమిత్తం సికింద్రాబాద్ లోని జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కు ఈ రోజు రిలీఫ్ మెమోలు అందచేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వి.గిరి,స్టేషన్ సూపరింటెండెంట్ లు శ్రీధర్ మరియు ఆనంతలక్ష్మి, చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ సత్యనారాయణ, ఆర్ పీ ఎఫ్ ఎస్ ఐ రామకృష్ణ,టికెట్ చెకింగ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బుకింగ్ ఆఫీస్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది పాల్గొని వారిని అభినందించి సత్కరించారు.