ప్రజాశక్తి-చిలకలూరిపేట : వర్షాల వల్ల పనులు లేక నిత్య కూలీలు, వీది విక్రయదారులు, చిరువ్యాపారులు, పూట గడవని చేతి వృత్తుల (షాపుల ముందు చెప్పులు కుట్టుకునేవారు, కొలిమి పనులు చేసుకునేవారు, పాత చీరలు అమ్ముకునేవారు)కుటుంబాలు, స్లమ్ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నా మంటున్నారు. గత వారం రోజుల నుంచి బంగాళఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వలన ముసురు పట్టి ఒక మోస్తారు, పట్టణ నియోజకవర్గ స్థాయిలో చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లు నుంచి బయటికి వచ్చే అవకాశం లేక ఇళ్లలోనే ఉండిపోయారు. వ్యవసాయ పనులు ప్రారంభ దశలో మురుసు పట్టడంతో రైతు కూలీలు కూడా పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా భవన నిర్మాన కార్మికులు చిరు వ్యాపారస్తుల, తోపుడు బండ్ల, విడి విక్రయదారులు, బుట్టలతో కూరగాయాలు, పండ్లు, గారెలు, బూరెలు ఇల్లుళ్లు తిరిగి అమ్ముకునేవారు ఇబ్బదులు పడుతున్నామంటున్నారు. ఇటువంటి పరిస్తుల్లో ప్రభుత్వం అధికారులు స్పందించి కూలీ పనుకు చేసుకునే వారికి ఒక ఐదు కిలోల బియ్యం, ఒక కె.జి. నూనె,10 రోజులకు సరి పడినంత కూర గాయాలు ఇప్పించాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సిఐటి యు మండల కార్యదర్శి పెరుబోయిన వెం కటేశ్వర్లు మాట్లాడుతూ మాములు సమయాల్లోనే కుటుంబాలు గడవక బజార్ల ప్రక్క చిన్న గొడుగు వేసుకుని రోజులెల్ల బుచ్చు తున్న చెప్పులు కుట్టుకునే వారు, రిక్షా, విధి విక్రయదారులు, తదితర చిరు వ్యాపారులు ఇదే విధంగా తోపుడు భళ్ళు,బుట్టలతో ఇళ్ళుళ్లు తిరిగి కూర గాయాలు, పండ్లు అమ్ముకునేవారికి వ్యాపార లేక వారి వారి కుటుంబాలు గడవక పస్తులుండాల్సిన పరిస్తుతుల్లో ఉన్నారని అటువంటి వారికి ప్రభుత్వం స్పందించి వెంటనే 5 కె.జీ. బియ్యం., కె.జీ కందిపప్పు,కె.జీ.నూనె.,10 రోజులకు సరిపడ కూర గాయలు వాలెంట్రీలు ద్వారా వారి వారి ఇళ్లకు పంపాలని నెలవారీ ఇచ్చే రేషన్ బియ్యం, ఫెన్షన్ తో సంభందం లేకుం డానే ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.










