- కార్యాలయంలో కనిపించని ఐసిడిఎస్ అధికారులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కేంద్ర ప్రభుత్వ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా స్పాన్సర్షిప్ కార్యక్రమంలో అనాథ బాలలకు ఆర్ధిక సాయం అందించాలని, అనాథ బాలలకు విద్య,ఆరోగ్యం, అభివృద్ధి అవసరాలకు ఉపయోగపడేలా ఆర్ధిక సాయం అందించేందుకు మిషన్ వాత్సల్య పథకాన్ని దరఖాస్తులు ఈనెల 26వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అనాధ బాలలకు కేంద్ర ప్రభుత్వ మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఆర్థిక చేయూత అందించేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రకటించింది.నిస్సహాయ స్థితిలో ఉన్న చిన్నారుల్ని ఆర్థికంగా ఆదుకోడానికి కుటుంబ ఆర్ధిక పరిస్థితికి ఉపయోగపడేలా ఆర్థిక సాయాన్ని అందిస్తారు. స్పాన్సర్షిప్ ద్వారా ఎంపికైన పిల్లలకు నెలకు రూ.4వేల రుపాయలను చెల్లిస్తారు.అయితే ఈ నెల 26వ తేదీ చివరి తేదీన కావడంతో ఐసిడిఎస్ రూరల్ ప్రాజెక్ట్ కు కార్యాలయానికి దరఖాస్తుదారులు తరలివచ్చారు. అయితే కార్యాలయంలో ఐసిడిఎస్ సిడిపిఓ, సూపర్వైజర్లు కార్యాలయం అందుబాటు లేకపోవడంతో దరఖాస్తుదారులు నిరాశ చెందారు. దరఖాస్తులు స్వీకరించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని దరఖాస్తుదారులు తెలిపారు. కనీసం త్రాగునీరు,కుర్చీలు కూడా లేకపోవడంతో దరఖాస్తుదారులు బంధువులు,తల్లి,తండ్రులు ఇబ్బందిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్యాలయం దరఖాస్తు స్వీకరించినందుకు ప్రత్యేక అధికారులను,త్రాగునీరు,కుర్చీలు ఏర్పాటు చేయాలని కోరారు.










