ప్రజాశక్తి-గుంటూరు : ప్రమాద సమయాల్లో ప్రాణాలు నిలపాలంటే ప్రథమ చికిత్స ఎంతో అవసరమని 7 హిల్స్ ఫార్మసీ సంస్థ అధినేత, టీడీపీ నగర్ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ చెప్పారు. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న ఆర్టీసీ సంస్థలో ఉన్న అన్ని బస్సులకు ఫస్ట్ ఎయిడ్ కిట్ లను శనివారం ఆయన పంపిణి చేశారు. గుంటూరు డిపోలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిపో -2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలాంతో కలిసి 500 ఫస్ట్ ఎయిడ్ కిట్ లను ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాలలో ప్రధమ చికిత్స చెయ్యని కారణంగా ప్రాణాపాయం సంభవిస్తుంటుందన్నారు. .అలాంటి ప్రాణాపాయ సమయంలో ప్రాణాలను కాపాడేందుకు ప్రథమ చికిత్స అనివార్యమన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే హాస్పిటల్ కి తరలించే లోపు ప్రాధమిక చికిత్స అందించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా కాపాడవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిబ్బంది, ప్రయాణికుల ఆరోగ్య దృష్ట్యా ప్రతి బస్సు కి ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రంపిణి చెయ్యడం జరిగిందన్నారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు చెయ్యడంలో తాను, 7 హిల్స్ సంస్థ ఎపుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. ఎప్పుడు, ఎలాంటి అవసరం వచ్చిన అందుబాటులో ఉంటనని ఈ సందర్భంగా ప్రభాకర్ పేర్కొన్నారు. అనంతరం డిపో -2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం మాట్లాడుతూ సిబ్బంది మరియు ప్రయాణికుల దృష్ట 7 హిల్స్ ఫార్మసీ సంస్థ అధినేత డేగల ప్రభాకర్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాల అభినందనీయం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తడివకా సుబ్బారావు మరియు ఆర్టిసి సిబ్బంది పాల్గొన్నారు.










