ప్రజాశక్తి -హోళగుంద(కర్నూల్) : ప్రాథమిక సహకార సంఘం కార్యాలయ నిర్మాణ పనులకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా హాజరై బుధవారం ఉదయం భూమి పూజ చేశారు. ప్రాథమిక సహకార సంఘం ఏర్పడినప్పటి నుండి ఇంతవరకు మండలంలో సొంత భవనం లేక పాతబడిన భవనాల్లో సంఘం లావాదేవీలు జరిపేవారు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సహకారంతో జిల్లా సహకార సంఘం వారు అప్పుగా సొంత కార్యాలయం నిర్మాణం కోసం 11 లక్షల రూపాయలు ముందుకు చేసినట్లు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ మల్లికార్జున తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు కార్యాలయానికి భూమి పూజ చేసి సొంత కార్యాలయం నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ నిలకంటి స్వామి, మెంబర్లు డి లక్ష్మి, ఎం సహారాబాను, వైఎస్ఆర్సి, నాయకులు శేషప్ప, మల్లికార్జున, రామకృష్ణ, కుమారస్వామి, ఆలూరు మండల వైఎస్ఆర్సి కన్వీనర్ వీరేష్, విక్రాంత్ రెడ్డి, ఉరుకుందప్ప, కించప్ప, తదితర నాయకులు పాల్గొన్నారు










