Jul 19,2023 21:11
  • కొత్త వ్యూహాత్మక పత్రానిు ఆమోదించిన జర్మనీ

బెర్లిన్‌ : చైనాపై యుద్దాన్ని సాగించేందుకు జర్మనీ ప్రభుత్వం చైనా వ్యూహాన్ని ఆమోదించింది. చైనాపై జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఆధారపడడాన్ని తగ్గించే లక్ష్యంతో 64పేజీల డాక్యుమెంట్‌ను రూపొందించింది. అధికార బాధ్యతలు చేపట్టడానికి ముందు జర్మనీ సంకీర్ణం కుదుర్చుకున్న ఒప్పందంలో చైనాను భాగస్వామిగా, పోటీదారుగా, వ్యవస్ధాగత ప్రత్యర్ధిగా పేర్కొనాురు. అప్పటి నుండి 'మన సంబంధాల్లో శతృత్వం, పోటీ అంశాలు పెరుగుతునే వునాుయి.''అని ఆ డాక్యుమెంట్‌ పేర్కొంది. మోసపూరితమైన మాటలైన ''పశ్చిమ దేశాల విలువలు'', ఉదారవాద ప్రజాస్వామ్యం, 'మానవ హక్కులు' వంటి పదాలను చొప్పించిన ఆ వ్యూహాత్మక పత్రం మొత్తంగా చైనాకువ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆర్థిక, రాజకీయ చర్యలు వివరిస్తోంది. చైనాపై ఆధారపడడానిు తగ్గించేందుకుగానూ, ఇతర దేశాల్లో సుస్థిరమైన సరఫరా మార్గాలను జర్మనీ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధిపరుచుకుంటోందనిఆ పత్రం పేర్కొంది. అలాగే కీలక రంగాల్లో చైనా సాంకేతికతలపై ఆధారపడకూడదని కూడా నిర్ణయించింది. ఇందుకుగానూ ప్రారంభ దశలోనే కీలక సాంకేతికతను గుర్తించాల్సిన అవసరం వుందనిపేర్కొంది. తమ స్వంత పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ రంగాల్లో మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలనిజర్మనీ ప్రభుత్వం భావిస్తోంది. చైనాతో సాంకేతికతలు బదిలీ జరగాల్సిన ప్రాజెక్టుల నుండి నిధులను ఉపసంహరించుకోవాలని భావిస్తోంది. చైనాలో చురుకుగా పనిచేస్తును జర్మనీ కంపెనీలు ఎదుర్కొనే ముప్పులపై గతంలో మాదిరిగా ఇకపై ప్రభుత్వం స్పందించబోదు. అలాగే చైనాకు ఎగుమతులను కూడా నియంత్రించనున్నారు. మొబైల్‌ ఫోన్‌ నెట్‌వర్క్‌లు వంటి కీలకమైన మౌలిక వ్యవస్థలో కొనిు చైనా విడిభాగాలను ఉపయోగిస్తున్నారు. ఐటియేతర ఉత్పత్తుల కోసం కూడా నిబంధనలను రూపొందించనున్నారు.