Apr 30,2023 16:22

ప్రజాశక్తి-ఏలేశ్వరం: అత్యంత ప్రతిష్టాత్మంగా జరిగిన ప్రత్తిపాడు కోర్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది చిట్టం శెట్టి పుల్లయ్య ప్యానల్ ఘనవిజయం సాధించింది. అధ్యక్షునిగా పుల్లయ్య తమ సమీప ప్రత్యర్థి ఏ సుగుణపై 24 ఓట్లు అధిక్యత సాధించారు. కార్యదర్శిగా బొంగులూరి మధుబాబు తమ సమీప ప్రత్యర్థి రాజాల చిట్టిబాబుపై 5 ఓట్లు అధికత సాధించగా, ఉపాధ్యక్షునిగా మల్ల గంగాధర్ సమీప ప్రత్యర్థి ఆర్ వెంకట్రావుపై 16 ఓట్లు అధికత సాధించగా, కోశాధికారిగా జొన్నాడ అప్పలరాజు తమ సమితి ప్రత్యర్థి ఏ నాగమల్లేశ్వరరావుపై 16 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సహాయ కార్యదర్శి, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శులుగా రాయి శ్రీనివాసరావు, లింగంపల్లి శివకుమార్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.