ప్రజాశక్తి-సామర్లకోట : 10వ తరగతి ఫలితాలలో స్థానిక ప్రతిభ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యధికంగా 594 మార్కులు సాధించి విజయకేతనాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక పాఠశాల ఆవరణలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులతో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎస్ వి వి జి ప్రకాష్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలలో పాఠశాల నుండి యు అశోక కుమార్ 594 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా కె గ్రీష్మ వర్షిత 585, కే సంపత్ రామ్ 578, పి త్రిపుర శ్రీ 578, ఎస్ హన్సుజ 577 మార్కులు సాధించారని అన్నారు. అలాగే 13 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించగా 58 మంది విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారని అన్నారు. తెలుగు లెక్కలు సైన్స్ సోషల్ సబ్జెక్టులలో 100/100 మార్కులు కూడా ఎక్కువ మంది సాధించారని తెలిపారు. ఈ స్థాయిలో విజయాలు సాధించడంలో ఉపాధ్యాయులు ఉన్నత స్థాయి బోధన, విద్యార్థుల కృషి,తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమని అన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ సుధారాణి, ప్రకాష్, సామర్లకోట పెద్దాపురం ప్రిన్సిపల్స్ టి సునీత, టీ అరుణ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.










