ప్రజాశక్తి - రెడ్డిగూడెం : 10వ తరగతి మోడల్ పరీక్ష పోస్టర్ ను ఎస్ఎఫ్ఐ, యుటిఎఫ్ నాయకులు పదో విద్యార్థులు విడుదల చేశారు. శనివారం నాడు మద్దుల పర్వ ఆదర్శ పాఠశాల నందు ప్రిన్సిపాల్ వీరారజు చేతులమీదుగా గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సీహెచ్.వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రెడ్డిగూడెం మండల నాయకులు కే.బాలు మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులుకు ప్రతి సంవత్సరం “ ప్రజ్ఞా వికాసం పేరుతో 10వ తరగతి మోడల్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తాము నిర్వహిస్తున్న పరీక్షలో పదోతరగతి విద్యార్థులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ పరీక్ష తేది , సోమవారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష సమయం ఫిబ్రవరి 20 వ తేదీ మధ్యాహ్నం 2 గం || ల నుండి 3-30 ని॥ల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు ఇప్పటి నుండే మార్కులు , ర్యాంకులు , గ్రేడులు సంపాదించి , తమ భవిష్యత్తుకు బాటలు వేసుకునే అన్వేషణలో నిమగ్నమై , పరీక్షల్లో పేపరు ఎలా వస్తుందో అనే ఆలోచనలలో ఉన్నారు. విద్యార్థులలో ఈ భయాన్ని పోగొట్టి మనోధైర్యాన్ని నిలిపేందుకు ప్రముఖ విద్యావేత్త , కృష్ణా , గుంటూరు గ్యాడ్యుయేట్ ఎం.ఎల్.సి. కె.ఎస్. లక్ష్మణరావు పర్యవేక్షణలో భారత విద్యార్థి ఫెడరేషన్ ( SFI ) , యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ( UTF ) ఎన్.టి.ఆర్.జిల్లా కమిటీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పరీక్ష “ ప్రజ్ఞా వికాసం” 10వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకుంటారని , మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామని అన్నారు. ఈ పరీక్ష 10 వ తరగతి సిలబస్ నుండి 100 మార్కులకు పరీక్ష ఉంటుందిని. అన్నారు. ఈ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీషు మీడియంలలో ఉంటుందిని. సబ్జెక్ట్స్ వారీగా లెక్కలు -20 , N.S - 10 , P.S - 10 , ఇంగ్లీషు -20 , తెలుగు -10 , హింది 10 , సోషల్ -20 మార్కులకు పేపరు తయారు చేస్తున్నామని అన్నారు . ఈ పరీక్ష 1 మార్కు ప్రశ్నాపద్ధతిలో ప్రశ్నలు , బబ్లింగ్ పద్ధతిలో OMR షీట్ జవాబు పత్రం ఉంటుంది. విద్యార్థులు ఈ ప్రజ్ఞావికాసం పరీక్షలలో పాల్గొని మంచి మార్కులకు నాంది కావాలని UTF, SFI ఎన్.టి.ఆర్. జిల్లా కమిటీలు సంయుక్తంగా విజ్ఞప్తి చేస్తున్నాయిని అన్నారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9394755525, 7671046821, నెంబర్లు సంప్రదించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోమోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు కే.బాలు, రవి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.










