ప్రజాశక్తి - పెద్దాపురం : మహిళలు, బాలింతలు, గర్భిణీలు పౌష్టికాహారంపై అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎన్ ఉమాదేవి అన్నారు. శనివారం పెద్దాపురం మండలం తూర్పు పాకలు గ్రామంలో గ్రామ సర్పంచ్ పడాల అన్నపూర్ణ అధ్యక్షతన జరిగిన పోషన్ మహా అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో పోషక విలువల ఆహారాన్ని తయారు చేసుకునే విధానాలపై అవగాహన కల్పించారు. ఆహారంలో తృణ ధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా బాలలకు పోషక విలువల ఆహారాన్ని ఏ విధంగా అందించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాదిరెడ్డి నాగమణి, అంగన్వాడీలు గౌరీ దేవి, రాణి తదితరులు పాల్గొన్నారు.










