ప్రజాశక్తి - పెద్దాపురం : పాఠశాలల్లో చదువుతున్న కిషోర్ బాలికలందరూ పౌష్టికాహారం పై అవగాహన పెంచుకోవాలని ఐ సి డి ఎస్ సి డి పి ఓ జి ఉష అన్నారు. శుక్రవారం స్థానిక పాత ఆసుపత్రి వీధిలోని జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో పోషణ మహోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన కిషోర్ బాలికల అవగాహన సదస్సులో ఆమె ప్రసంగిస్తూ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్స్, మినరల్స్, కాల్సీఎం, ఐరన్, పోలిక్ యాసిడ్ ఉన్న ఆహార పదార్థాల పై అవగాహన కల్పించారు. హై స్కూల్ ప్రధానోపాధ్యాయిని కె శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఏసిడి పి ఓ ఏ జ్యోతి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల అనర్ధాలు, ఉమెన్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై అర్థమయ్యే రీతిలో వివరించారు.అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సులో అంగన్వాడి సూపర్వైజర్ సిహెచ్ వెంకటలక్ష్మి, అంగన్వాడీలు పద్మావతి, మాధవీ దేవి, స్నేహలత, స్వరూప, ఉమా, ఈశ్వరి, ఇందిర, మంగ తదితరులు పాల్గొన్నారు.










