ప్రజాశక్తి-ఏలేశ్వరం: ఘరానా దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ పదివేల రూపాయలు నజరానా ఇవ్వడం జరుగుతుందని ప్రతిపాడు సీఐ కె కిషోర్ బాబు తెలిపారు. కింద విజువల్స్ లో ఇవ్వబడిన వ్యక్తి ఈ నెల 11న జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ పై భార్యాభర్తలను తన బుల్లెట్ తో అనుసరించి వెనక కూర్చున్న భార్య మెడలోని బంగారు గొలుసు, నక్లెస్ లాక్కుని రాజమండ్రి వైపు వెళ్ళాడు. దీంతో క్రింద పడ్డ భార్యాభర్తలు గాయాలు పాలయ్యారు. వ్యక్తిని గుర్తించి తమకు సమాచారం అందించిన వారికి 10 వేల రూపాయలు నజరానా ఇస్తామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని సీఐ తెలిపారు. సమాచారం తెలిసినవారు 9440796530, 9440796570, 9440796508 నంబర్లకు తెలియజేసి బహుమతిని పొందాలని ఆయన కోరారు.










