ఏమండీ..
ఎండ మండిపోతుందని..
చేతికొచ్చిన పత్తిచెట్టు
ఎండిపోతుందని..
అప్పుల కుప్ప
పెరిగిపోతుందని.. సత్తరపడి..
పురుగుమందు డబ్బాను
అలా చూడకండీ..!
వర్షాలు
చేనుపై శీతకన్నేస్తే
మనం ఊరి గీతదాటి
జీవితం బాగాలేదని
పొట్టపోత పోసుకుందాం..
నా కండ్ల వాన
చేనులో చెట్లను
బ్రతికించేటంత వస్తే..
ఎంత బాగుండు కదండీ..!
ఏమండీ
కలత చెంది.. గుండె మండి..
మన బతుకుల్ని
పురుగుమందులో ముంచకండీ
నా కండ్ల వానతో
మీ కాళ్ళు కడుగుతా..!
- అభిరామ్, 9704153642