ప్రజాశక్తి - వన్ టౌన్: 50 డివిజన్ పరిధిలో గుణ బత్తుల అచ్చయ్య వీధి బంక కామరాజు వీధి, బెజ్జాల మేడ వీధి, మంచినీటి సరఫరాలో పొల్యూషన్ సమస్యలు స్థానిక ప్రజలు కార్పొరేటర్ బి సత్యబాబుకి తెలియజేసిన్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చి తెలియజేయగా ఎనిమిది లక్షల 25 వేల వ్యయంతో పాత వాటర్ పైప్ లైన్ స్థానంలో కొత్తగా హెచ్డి ఎఫ్సి మంచినీటి పైప్ లైన్ వేసే పనులు మంజూరు చేయటం జరిగింది.ఈ పనులు కార్పొరేటర్ బి సత్యబాబు ఈ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సత్తిబాబు మాట్లాడుతూ డివిజన్ ప్రజల ఇబ్బందులు పరిష్కరించేందుకు మంచినీటి కాలుష్యం అరికట్టేందుకు ఈ నూతన పైప్ లైన్ వేయడం వల్ల ప్రజల మంచినీటి ఇబ్బందులు పరిష్కారం అవుతాయని తెలిపారు. సహకరించిన మున్సిపల్ కమిషనర్ అధికారులకు ధన్యవాదాలు తెలియ చేశారు. డివిజన్ సెంటర్ ఇన్స్పెక్టర్ యం,రవిశంకర్ స్థానిక పెద్దలు పి వరప్రసాద్, కే సుబ్బారావు, ఏ దుర్గారావు గారు తదితరులు పాల్గొన్నారు.










