న్యూఢిల్లీ : డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పేలో ఇక సమగ్రమైన, సరళమైన రీతిలో పన్ను చెల్లింపులు చేయవచ్చని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం ఆన్‌లైన్ టాక్స్ ఫైలింగ్ ఫ్లాట్‌ఫామ్ టాక్స్2విన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో తమ 25 కోట్ల వినియోగదారులకు ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపునకు డిసెంబర్ 31 తుది గడువుగా నిర్ణయించింది.










