హైదరాబాద్ : నిరంతరాయమైన, సురక్షితమైన కాంటాక్ట్ లెస్ పేమెంట్ ఆప్షన్లను అన్ని ప్రాంతాల ప్రయాణీకులకు అందించడం కోసం హైదరాబాద్ మెట్రోరైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫోన్‌పే వెల్లడించింది. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు క్యూల బెడద లేకుండా నగదు రహితంగా టికెట్ బుకింగ్ చేసుకునే వీలుందని ఫోన్‌పే తెలిపింది. ఇక తమ యాప్‌లో మెట్రో రైలు డిజిటల్ ఆధారిత టికెట్లను బుక్ చేసుకునే వీలు ఉంటుందని పేర్కొంది. ఫోన్‌లోని ఇ-టికెట్‌ను మెట్రో స్టేషన్ లోనికి , బయటికి వెళ్లే గేట్ల వద్ద స్కాన్ చేస్తే సరిపోతుందని తెలిపింది.










