ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీలో దసరా పండగ పాడ్యమి సందర్భంగా మంగళవారం రాత్రి కొందరు యువకులు నార్పల స్మశానం పక్కన ఉన్న మామిడి తోటలో ఐదుగురు యువకులు పార్టీ చేసుకుని మద్యం సేవించారు. అయితే ఐదుగురిలో ఒకరు అయినటువంటి నారాయణస్వామి( వయసు 30) అనే యువకుడు అనుమానస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. నారాయణస్వామి అనే యువకున్ని హత్య చేశారా అని మండల వ్యాప్తంగా చర్చగా మారింది. ఇది హత్య... లేదా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీసులు సందర్శించారు.










