- ప్రముఖ తంత వైద్యులు డాక్టర్ శిరీష
ప్రజాశక్తి - పెద్దాపురం : విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు దంత సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రముఖ నక్షత్ర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ జమ్మి శిరీష అన్నారు. స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో ఆదివారం ఆమె విద్యార్థులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. క్యాంపు కో-ఆర్డినేటర్ రొంగల అరుణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పిల్లలు ఏమి తిన్నా సరే నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలన్నారు. చాక్లెట్స్ కు పిల్లలు ఎంత దూరంగా ఉంటే దంత సమస్యలు అంత దూరంగా ఉంటాయన్నారు. దంతాల విషయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కు చూపించాలన్నారు. ఈ సందర్భంగా ఆమె నోటిని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కూనిరెడ్డి అరుణ, మంజుల, అమృత, నమ్రత, సూరజ్, ఐశ్వర్య, సందీప్,దారపు రెడ్డి కృష్ణ,రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.










