Jul 10,2023 15:58

ప్రజాశక్తి- దేవనకొండ : సేవా భావంతో పనిచేస్తున్న వాలంటీర్లపై అసత్య ఆరోపణలు చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తగదని వైస్సార్సీపీ యువ నాయకులు కాకర్ల శాంతికుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా, కుటుంబాల్లో ఎవరైనా  వితంతువులు ఉన్నారా ఇలా వాలంటీర్లు సమాచారం సేకరించి హ్యుమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పడం దారుణం అన్నారు.  వాలంటీర్లు  పేద ప్రజలకు ఇంటి దగ్గరకు వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు.కరోనా టైంలో బంధుమిత్రులు ఇళ్లకు రానప్పుడు కూడా వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి.మందులు, పాలు, పెరుగు అందించారని గుర్తు చేశారు. వాలంటీర్ల పై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకున్నాలని డిమాండ్ చేశారు.