ఇంటర్నెట్డెస్క్ : గొంతులో కఫం చేరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? అయితే దీనికి చక్కటి పరిష్కారం పసుపుతో లభిస్తుంది. రోజూ మీరు దగ్గు, కఫంతో బాధపడుతుంటే పసుపుతో ఇలా చేసి చూడండి.
- గోరువెచ్చని నీటిలో ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని వరుసగా మూడు, నాలుగురోజులు తాగితే కఫం నుంచి ఉపశమనం లభిస్తుంది.
- రెండు కప్పుల వేడినీటిలో ఐదారు అల్లం ముక్కలు, ఒక ఎండుమిర్చి, టీ స్పూన్ తేనె కలిపి మరిగించాలి. ఆ నీటిని వడకట్టి.. అందులో కొంచెం తేనె కలిపి తాగితే కఫం తగ్గుతుంది.
- ఐదు కప్పుల నీటిలో కొద్దిగా కర్పూరం, తులసి ఆకుల్ని వేసి ఆవిరిపట్టుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కఫం తగ్గుతుంది.