Oct 25,2023 17:23

ఇంటర్నెట్‌డెస్క్‌ : రోజూ కూరల్లో రుచికి, సువాసన కోసం వేసుకునే కరివేపాకు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కరివేపాకు వల్ల బిపి కంట్రోల్‌ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- కరివేపాకులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే కరివేపాకును తీసిపారేయకుండా తింటే మంచిది.
- కూరల్లో మాత్రమే కాకుండా.. కరివేపాకు టీని తయారుచేసుకని తాగినా ఆరోగ్యానికి మంచిదే. లేదా ఎండిన కరివేపాకులను వేడినీటిలో ఉడికించి ఆ నీటిని వడగట్టి తాగితే బిపి కంట్రోల్‌ అవుతుంది.
- కరివేపాకు చట్నీ లేదా కరివేపాకు పొడిని రెగ్యులర్‌గా అన్నంలో వేసుకుని తింటే బిపి కంట్రోల్‌ అవుతుంది.