న్యూఢిల్లీ : ఈజిప్టులో తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమతి వాతావరణ సదస్సు 27లో పరిహార నిధి ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదరడంపై భారత్ హర్షం వ్యక్తం చేసింది. దీని కోసం సుదీర్ఘ కాలం నుంచి ప్రపంచం ఎదురుచూస్తుందని తెలిపింది. ఒప్పందం కుదరడాన్ని చారిత్మ్రకంగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వర్ణించారు. పరిహార నిధి ఏర్పాటు చేయడానికి ఏకాభిప్రాయాన్ని తీసుకునిరావడంలో అవిశ్రాంత ప్రయత్నం చేస్తున్న ఈజిప్టు కృషిని మంత్రి అభినందించారు.










