Feb 13,2021 00:59

ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి - అనకాపల్లి
స్థానిక అనకాపల్లి మర్చంట్స్‌ అసోసియేషన్‌ లింగమూర్తి కళాశాల, విశాఖ హెచ్పిసిఎల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రాంగణ నియామకాలు కళాశాలలో నిర్వహించారు. 765 మంది అభ్యర్థులు హాజరు కాగా 450 మంది ఎంపికయ్యారు. వీరిలో ఏఎంఎఎల్‌ కళాశాలకు చెందిన 35 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారికి సుమారు రెండు నెలల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయంతో శిక్షణ ఇస్తామని హెచ్పిసిఎల్‌ సీనియర్‌ మేనేజర్‌ మహేష్‌ తెలిపారు. శిక్షణ అనంతరం భారత ప్రభుత్వ శిక్షణ ధ్రువపత్రంతో పాటు హైదరాబాద్‌, విశాఖపట్నం ప్రాంతాల్లోని వివిధ ఫార్మా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంపికైన వారిని కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కొల్లూరు ఎస్‌ఎన్‌ మంగరాజు, కళాశాల కరస్పాండెంట్‌ దాడి శ్రీనివాస రావు, ప్రిన్సిపాల్‌ జయబాబు, సూపరింటెండెంట్‌ అనురాధ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్పిసిఎల్‌ మేనేజర్‌ కిరణ్‌కుమార్‌, ఎస్‌డిఏటి జగదీష్‌, వైస్‌ప్రిన్సిపల్‌ హరిబాబు, జెకెసిి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వెంకట సుధాకర్‌ పాల్గొన్నారు.