ప్రజాశక్తి-పుట్లూరు : రేపు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగు పంట తోటలు రైతు సంఘం రాష్ట్ర సదస్సుజయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం పుట్లూరు మండల కమిటీగా రైతులను కోరుచున్నాము అన్నారు. అనంతరం రాష్ట్రంలో పండ్లతోటల సాగు పెరుగుతుంది రైతుల కష్టాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం నుండి అవసరమైన పంట పెట్టుబడి సహాయం పంట నష్టపరిహారం అందడం ద్వారా పండ్ల తోటల రైతుల కష్టాలు కొ నైనాతీరుతాయి ఆధునిక శాస్త్రీయ పద్ధతులను రైతులకు అందుబాటులో ఉంచాలి. ఉద్యాదశాఖ సిబ్బంది మార్కెటింగ్ శాఖల సహకారం ఎంతో పెరగాలి పండ్ల తోటల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి సమస్యల పరిష్కారానికి రైతులను ఐక్యం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలు నిర్వహించడానికి తాడిపత్రి యందు ఈ రాష్ట్ర సదస్సు జరుగుచున్నది. జిల్లాలో పండ్ల తోటలు విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతున్నది జిల్లాలో రెండు లక్షల హెక్టార్లకు పైగా వివిధ రకాలైన పండ్లతోటలు సాగవుతున్నాయి ప్రధానంగా చీని, మామిడి, దానిమ్మ ,అరటి ,రేగు ,సపోటా, కలింగర జమ,బొప్పాయి, ద్రాక్ష, కర్పూజ తదితర పండ్ల తోటలో కూరగాయలు సాగు చేస్తున్నారు. పండ్ల తోటల సాగు భారీ పెట్టుబడులతో కూడుకున్నది ఎక్కువ భాగం అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారు జిల్లాలో ఇప్పటికీ సరైన మార్కెట్ సౌకర్యం లేక వ్యాపార వర్గాలు దళారీలతో కుమ్మక్కై ఏదో ఒక సాకుతో ధరలు తగ్గిస్తున్నారు. దళారీల మోసాల నుండి రైతులను కాపాడవలసిన ప్రభుత్వ అధికారుల్లో కొందరువారిచ్చే మామూళ్లకు అలవాటు పడి రైతులను దగా చేస్తున్నారు. రాష్ట్రంలో పండ్ల తోటలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి వాటిని పరిష్కారం చేసుకోవడానికి ఈసదస్సు జరుగుతున్నది.










