న్యూఢిల్లీ : దేశంలోనే ప్రముఖ వార్తా సంస్ధ అయిన ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా(పిటిఐ)నుంచి వార్తలు తీసుకునే ఒప్పందం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ప్రసార భారతి తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన నిర్ణయమని ప్రసారభారతి అధికారులు చెబుతున్నప్పటికీ, వార్తలకు సంబంధించి వచ్చిన విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్ల్లు ప్రచారం జరుగుతోంది. పిటిఐతో సబ్స్క్రిప్షన్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మీడియా స్వేచ్ఛపై దాడి అని విరమ్శలు వస్తున్నాయి. వార్షిక సభ్యత్వ విషయంలో విభేదాల అనంతరం ప్రసార భారతి మరో వార్తా సంస్థ యునైటైడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యుఎన్ఐ)పై కూడా వేటు వేసింది. ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్ (ఎఎన్ఐ) ఆడియో, విజువల్ కంటెంట్ డిజిటల్ కంటెంట్ తనకు అనుకూలంగా ఉండడంతో మోడీ ప్రభుత్వం ఆ వార్తా సంస్థను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. అందుకే పిటిఐకి స్వస్తి చెప్పినట్లు వార్తలస్తున్నాయి.
2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పునరుద్ధరించబడిన ఆసియా న్యూస్ ఇంటర్నేషనల్(ఎఎన్ఐ), హిందుస్ధాన్ సమాచార్లను అధికారిక ఏజెన్సీలుగా నియమించుకునేందుకు ప్రభుత్వం పిటిఐని బలిచేస్తోంది. భారత్‌కు చైనా తరపున రాయబారిగా ఉన్న సన్ వీడంగ్, బీజింగ్‌లో భారత రాయబారి విక్రం మిస్రిలతో పిటిఐ ఇంటర్వ్యూ చేయడమే ప్రసార భారతి దృష్టిలో నేరమైపోయింది.










