Mar 16,2023 20:51

న్యూఢిల్లీ : దూరదర్శన్‌, ఆకాశవాణిలను నిర్వహించే ప్రసార భారతిని ఆర్‌ఎస్‌ఎస్‌ తన సొంత సంస్థ హిందూస్తాన్‌ సమాచార్‌ ద్వారా స్వాధీనం చేసుకోవడం పట్ల నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌ (ఎన్‌ఎజె), ఢిల్లీ జరులిస్టుల యూనియన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశాయి. జాతీయ వార్తా సంస్థ పిటిఐ స్థానంలో జాతీయ ప్రసార సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్‌లకు వార్తలను సరఫరా చేసే కాంట్రాక్టును హిందూస్తాన్‌ సమాచార్‌ దక్కించుకుంది. ఒకప్పటి ప్రధాన వార్తా సంస్థలైన పిటిఐ, యుఎన్‌ఐలను పక్కకునెట్టి, వాటి ప్రాధాన్యతలను తగ్గించడమే ఈ చర్య వెనుక గల ఉద్దేశమనిఆ ప్రకటన పేర్కొంది. పాలక పార్టీకి అనుగుణంగా దేశంలో వార్తలను కాషాయీకరణ చేయడం ద్వారా స్వతంత్ర, స్వేచ్ఛా, తటస్థ జర్నలిజాన్ని నిర్మూలించాలనుదే వారి లక్ష్యంగా వుందని జర్నలిస్టు యూనియన్లు విమర్శించాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతానికి అనుగుణంగా సమాచారాన్ని రూపొందించేందుకు 1948లో హిందూస్తాన్‌ సమాచార్‌ ఆవిర్భవించింది. దేశ, రాష్ట్రాల రాజధానుల్లో దూరదర్శన్‌, ఆకాశవాణిలకు తమ సొంత విలేకర్లు ఉనాురు. వారికి తోడు పిటిఐ, యుఎన్‌ఐ దేశ విదేశాల నుండి ఇచ్చే వార్తా సమాచారం తోడవుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ వార్తా సంస్థలకు ఆదేశాలు జారీ చేస్తూ షరతులు పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాంతో పిటిఐకి ప్రసారభారతి సబ్‌స్క్రిప్షన్‌ ఆగిపోయింది. యుఎన్‌ఐని ఉద్దేశ్యపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. దాంతో ఆ సంస్థలకు చెందిన జరులిస్టులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ చర్యలనీు లౌకిక, ప్రజాస్వామ్య రాజకీయాలకు మరో సవాలు విసురుతున్నాయని ఎన్‌ఎజె అధ్యక్షులు ఎస్‌కె పాండే, డియుజె ప్రధాన కార్యదర్శి సుజాత మదోక్‌, ఎన్‌ఎజె ప్రధాన కార్యదర్శి ఎన్‌.కొండయ్య విమర్శించారు. ఈ సంస్థకు వార్తా సమాచారాన్ని అందజేసే పాత్రను కట్టబెట్టడమంటే భారత సమాజానిు, రాజకీయాలను మరింత కాషాయీకరణ చేయడమేనని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమేనని వారు ఆ ప్రకటనలో పేర్కొనాురు. ప్రతిపక్షంలోని పార్టీలకు కూడా ఇది తీవ్రమైన ముప్పేనని తెలిపారు.