ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వల్ల కల్లాల్లో అరబెట్టిన ధాన్యం నీట మునిగిందని ఆ ధాన్యం అరబెట్టిన ఆయ వచ్చి మొక్క వచ్చే ప్రమాదం ఉందని ఈ ధాన్యం అమ్ముడుపోకపోతే పెట్టిన పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం ఉండదని కరకుదురు రైతులు కౌలు రైతుసంఘ నాయకులు వద్ద వాపోయారు. బుధవారం వర్షం వస్తున్నా ధాన్యం ఓబ్బిడి చేసుకునే పనిలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు చెప్పుకుని కౌలు రైతు సంఘ నాయకుల వద్ద రైతులు వాపోయారు. కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్ పెదపూడి మండలం కరకుదురులో కల్లాల్లో ధాన్యం అరబెట్టిన రైతులను కలిసి రైతు భరోసా కేంద్రం విఏఏ, మండల ఏఓలతో ఫోన్ లో మాట్లాడి రైతుల ఇబ్బందులను వారు దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ కౌలుదారులే సాగులో వున్నారని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి, నిభందనలు సడలించి ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసు కోవాలని రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వాతావరణం ఇలానే వుంటే పంట నష్టం నమోదుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఆరుదల నిబంధన వర్షం వల్ల రైతుకు తీవ్ర నష్టం వస్తుందని, ఒదులు ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టాలని రాజశేఖర్ డిమాండ్ చేసారు. ఇన్సూరెన్స్ కూడా కౌలు రైతుకు అందడం లేదని కౌలు రైతులు వాపోయారు. కౌలు చట్టం 2019 మారిస్తేనే కౌలుదారులకు కార్డులు వస్తాయని రాజశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో రైతులు అడపా శ్రీనివాస్, పెమ్మానబోయిన సత్యనారాయణ, పి.శివ, నక్క వెంకన్న, పాఠంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.










