సమతా మూర్తి
సంపన్నవర్గాల ఆదర్శమూర్తి
భౌతికవాదానికి కలిగించదు స్ఫూర్తి..
సమానత
ఒక వర్గానికేనా
వైరుధ్యాల అన్నిటికీ పరిసమాప్తి ఈ మూర్తేనా?!
సమతా మూర్తీ!
కుల మతాలు ఉంటేనే ధర్మం అంటారు ఏమిటో
కాస్త చెబుతారా జియర్లూ ఆ మర్మమేమిటో?!
మతం మత్తు
ఎక్కిస్తూ వేల కోట్లతో ఆలయాలు..
నడయాడే దేవుళ్లకు లేవు కదా ఆశ్రయాలు.
సమతా మూర్తి
గొప్పవాడికి పటాటోపం
పేదోడికి శఠగోపం..
ప్రభుత్వాల ద్రవ్యలోటు
విద్య వైద్యం ఉపాధి కల్పన కొరకయితేనే..
వేల కోట్లు ఇస్తారు ఆలయాల నిర్మాణాలకు..
- కె దేవికారాణి రత్నాకర్
9908706218