Jul 02,2023 15:50
  • సబ్ డివిజన్ యాంకర్ షేక్ మాబు వలి

ప్రజాశక్తి-వెల్దుర్తి : వెల్దుర్తి మండలం కలగొట్ల గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సాగు చేయడం వలన రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని వ్యవసాయం లాభదాయకంగా మరియు భూమి సురక్షంగా ఉంటుందని సబ్ డివిజన్ యాంకర్ మాబు వలి రైతులకు చెప్పడం జరిగింది.  కలుగొట్ల గ్రామంలో  సెంటర్లో రైతులకు బీజామృతం తయారీ డెమో చేసి చూపించడం జరిగింది.  బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేసి పొలంలో వేసుకోవడం వలన విత్తనం నుంచి సంక్రమించే రోగాలను అరికడుతుంది.  విత్తనాలను బీజామృతంతో కలిపిన తర్వాత నీడలో అరబెట్టి అనంతరం విత్తుకోవాలి మిరప మరియు ఉల్లి మరియు టమోటా నార్లను బీజామృతంతో నారును శుద్ధిచేసి నాటుకోవాలి. ఇలా చేయడం వలన వేరు ద్వారా సంక్రమించే రోగాలను అరికట్టుతుంది మరియు మొక్క ఆరోగ్యకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఈ బీజామృతాన్ని తయారు చేసుకోవచ్చు అని అన్నారు. తయారీకి కావలసిన పదార్థాలు ఆవు పేడ 5 కిలోలు, సున్నం 50 గ్రాములు, నీరు 20 లీటర్లు ఆవు మూత్రం 5 లీటర్లు పుట్ట మట్టి పిరికడు కావాలన్నారు తయారు చేసే విధానం 25 లీటర్లు మట్టి పాత్ర తీసుకోవాలి. అందులో 20 లీటర్ల నీరు పోయాలి 5 లీటర్ల ఆవు మూత్రం 50 గ్రాముల సున్నం పిడికెడు పుట్టమట్టి వేయాలి 5 కేజీల ఆవుపేడను కాటన్ గుడ్డలో మూట కట్టి ఒక కర్రకు కట్టి పాత్రలో వేలాడదీయాలి.  ఇలా చేసిన తర్వాత రోజుకు రెండుసార్లు సవ్య దిశలో కర్రతో తిప్పాలి ఇలా చేసిన తర్వాత రెండు గంటల తర్వాత బీజామృతం తయారవుతుంది అని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఎన్ MT వెంకటేశ్వర్లు L2 పరమేశ్వరుడు, ICRP లు పార్వతమ్మ గారు రామచంద్రుడు మరియు రైతులు పాల్గొన్నారు.