- యూనిఫార్మ్ సివిల్ కోడ్, పార్లమెంట్ వర్షాకాలసమావేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ గళమెత్తాలి.
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : బిజెపి ఎన్నికల ఎత్తుగడైన యూనిఫాం సివిల్ కోడ్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ గెలమెత్తాలని ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు- ఎస్.ఎన్.రసూల్ అన్నారు. ఒకే దేశం ఒకే చట్టం అంటూ ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ పదేపదే యూనిఫామ్ సివిల్ కోడ్ వంటి చట్టాలు తేవాలని చర్యలు చేపట్టడం కేవలం వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ మరో డ్రామాకు తెర లేపారని ఇన్సాఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎన్.రసూల్ ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు.ఎన్నికలు వచ్చే ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని ముస్లిమ్ మైనార్టీలను, ఎస్సీ, ఎస్టీలను తదితర మైనార్టీ సెక్షన్ల పైన రకరకాల దాడులు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని మోడీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. యూనిఫార్మ్, సివిల్ కోడ్ వలన కేవలం వర్గాల మధ్య వైశ్యామ్యాలు పెంచి వారు కుర్చీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్.ఆర్.సి,సి.ఏ.ఏ వంటి చర్యలకు పాల్పడి ప్రజల నుండి తీవ్ర తీరేకత వచ్చాక అది అమలు చేయకుండా తాత్కాలికంగా ఆపారని తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా కేవలం కూల్చడం, పడగొట్టడం వారి ఆహారాల పైన దాడులు చేయడం వారి వస్త్రాల పైన రకరకాల ఇబ్బందులు పెట్టడం తద్వారా లబ్ధి చేకూరాలని చూస్తున్నారని తెలిపారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీలను ఎస్టీ సోదరులను అన్ని ఆలయాలలోకి ప్రవేశం కల్పించాలని కోరారు. కేవలం కొన్ని వర్గాలను టార్గెట్ చేసి పబ్బం గడుపుకోవడానికి మోడీ, ఆర్ఎస్ఎస్ అజెండాను అమలుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మోడీ వచ్చిన తర్వాత దేశంలో ఒక కొత్త ప్రాజెక్టు అయినా ఏర్పాటు చేయగలిగినారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా భారతదేశం లౌకిక దేశమని భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తున్న దేశమని వారు గుర్తు ఎరగాలని హితవు పలికారు. యూనిఫాం సివిల్ కోడ్ పైన ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్సాఫ్ కమిటీ నాయకులు అన్వర్ భాష,ఫక్రుద్దీన్,రహిమాన్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.










