Jun 18,2023 16:18

కర్నూల్-స్పోర్స్ : ఒలంపిక్ దినోత్సవం పురస్కరించుకొని జరుగుతున్న అంతర్ పాఠశాలల క్రీడా పోటీల్లో భాగంగా ఆదివారం హాకీ, సెపక్తక్రా, ఉషు, స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఈ నాలుగు క్రీడాంశాలలో విద్యార్థులు  అధిక సంఖ్యలో  పాల్గొన్నారు. 

 స్విమ్మింగ్:  స్థానిక స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ లో జరిగిన అంతర్ పాఠశాల స్విమ్మింగ్ పోటీలలో జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు లాంచర్నంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలంపిక్ దినోత్సవం దృష్టిలో ఉంచుకొని నగరంలో అంతరస్థాయి పోటీలో నిర్వహిస్తున్నామన్నారు 22 జరిగే ఒలంపిక్ పరుగులు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి నరసింహులు, రిటైర్డ్ శిక్షకులు నటరాజ్, ఒలంపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీనివాసులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

 ఉషు  :  స్థానిక బాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన విష పోటీలను కార్యదర్శి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ పోటీలలో సుమారు 60 మంది క్రీడాకారులు వివిధ పాఠశాల చెందిన వారు పాల్గొనడం గర్వకారణం.

 హాకీ  : స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది జయరాజు పాల్గొని హాకీ స్టిక్తో బంతిని కొట్టి పోటీలను ప్రారంభించారు. హాకీ కి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని తాను స్వయాన హాకీ క్రీడాకారుని గుర్తు చేశారు ఈ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన జట్టుకు తాను నగదు బహుమతిగా 5000 రూపాయలను ముగింపు వేడుకలలో అందజేస్తామన్నారు. కార్యక్రమంలో బిల్డర్ ఆనంద రెడ్డి, యునైటెడ్ ఇన్సూరెన్స్ మేనేజర్ వినీత్ కుమార్, ఒలంపిక్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసులు, హాకీ సంఘ ప్రతినిధులు రసూల్, ద్వారకానాథ్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 కరాటే  :  అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కరాటే పోటీలను మౌర్య ఇన్ మేనేజర్ ముఖ్య అతిథిగా తెలుగుదేశం నాయకులు మన్సూర్ అలీ ఖాన్ పాల్గొని పోటీలను లాంచనంగా ప్రారంభించారు కరాటే వల్ల ప్రత్యర్థుల భారీ నుండి తప్పించుకోవడానికి వీలుంటుంది. కావున ప్రతి ఒక్కరు పోరాటను అభ్యసించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మార్షల్ ఆర్ట్ లో ప్రావీణ్యం తప్పనిసరి అన్నారు కార్యక్రమంలో జిల్లా ఒలంపిక్ సంఘం ప్రతినిధులు శ్రీనివాసులు, సునీల్ కుమార్,అవినాష్ ,శ్రీను, కరాటే శిక్షకులు ఆరిఫ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు 15 0మంది క్రీడాకారులు హాజరు కావడం జరిగింది.