ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : అమరగాయకుడు ఘంటసాలకు సత్కళవాహిని సభ్యులు ఆధ్వర్యంలో సంగీత ప్రియులు సోమవారం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల సంగీతం, పాటలపై ప్రజలకు అవగాహన చేయాలని తలంపుతో 12వ జాతీయ మహాసభలు కాకినాడలో నిర్వహించాలని ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక బాపట్ల అధ్యక్షులు కోట వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. స్థానిక దేవాలయం వీధి పిండాల చెరువు వద్దగల ఘంటసాల విగ్రహం వద్ద గోడపత్రిక ఆవిష్కరించారు. కాకినాడలో ఈ అవగాహనా సదస్సుకు డా.తురగా సూర్యారావును కన్వీనర్ గా నియమించారు. ఈకార్యక్రమంలో సీతారామరాజు కళావేదిక ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు, నటరత్న కళామందిర్ పుచ్చకాయల చంద్రమౌళి, యుటిఎఫ్ నాయకులు సత్తిరాజు సత్యనారాయణ రాజు సత్కళ్ల వాహిని కృష్ణమాచార్యులు, తురగా సూర్యారావు కే.వి ప్రసాద్ వి.రమేష్ ఏం.శ్రీనివాసరావు ఎస్.సురేష్ వైనాట్ జే.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










