ప్రజాశక్తి-పెద్ద కడుబూరు : కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పాఠశాలకు ఇంతవరకు బియ్యం అందలేదని పిల్లలకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని హెచ్ఎం సురేష్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. వంట నిర్వాకులే ప్రతిరోజు 50 రూపాయలకు ఒక కిలో బియ్యం తీసుకుని వచ్చి పిల్లలకు వంట చేసి పెడుతున్నారని ప్రతిరోజు పిల్లలకు 15 కిలో బియ్యం అవసరమవుతున్నాయని గురువారం ఉదయం సురేష్ బాబు తెలిపారు. అలాగే కిరాణా షాపుల్లో లేదా ఇతర చోట్ల నుంచి తీసుకువచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం వండించవలసిన పరిస్థితులు నెలకొన్నాయని వంట నిర్వాకులు చాలా తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలకు బియ్యం అందేలా చూడాలని హెచ్ఎం సురేష్ బాబు తెలిపారు.










