May 03,2023 12:21

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ : ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పరిశుభ్రత పేరుతో వేల రూపాయలు కాజేస్తూ పరిశుభ్రత పాటించడం మరిచారు. ఇదే వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కూరగాయల మార్కెట్ ఉండడం వలన అక్కడక్కడ మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందితో క్లీనింగ్ చేపిస్తున్నారు. అయితే నెలకు 74 వేల రూపాయలు మార్కెట్ యార్డ్ సెక్రెటరీ తన బినామీ పేరుతో టెండర్ వేయించి ఆయనకు నెలకు 2000 ఇచ్చి మిగతా 72,000 ఆయన కాజేస్తూ పరిశుభ్రత గురించి మాత్రం పట్టించుకోకుండా ఉన్నట్లు తెలుస్తుంది. ఏకంగా తన కార్యాలయం ముందు నీటి కుంట్ల నీరు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, అదేవిధంగా మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్లు విచ్చలవిడిగా రైతులను మోసం చేస్తున్న నామమాత్రపు తనకీలు నిర్వహించి వారు అక్రమాలను కపిపుచ్చుడానికి తమ వాటా తను తీసుకొని దర్జాగా ఆఫీసుకు వచ్చామా! పోయావా! అనే విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. పత్తి జిన్నింగ్ ట్రేడర్స్ వారి దగ్గర పత్తి బేల్ కు 5000 రూపాయలు తీసుకొని లారీలను పర్మిట్ లేకుండా పంపిస్తున్నారు, ఈ అవినీతి డబ్బులు డీ.డి.యం, జె.డి.యం లకు కూడా అందుతున్నట్లు గుసగుసలాడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులను అనేక రకాలుగా మోసం చేస్తున్నప్పటికీ అ.ని.శా అధికారులు, విజిలెన్స్ అధికారులు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ పై నిఘా ఉంచి రైతులకు జరుగుతున్న అక్రమలను, నిరోధించాలని రైతుల కోరుకుంటున్నారు.