న్యూఢిల్లీ : తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులను బుధవారం రాత్రి శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. పుదుకొట్టె జిల్లాలోని కొట్టెపట్నం మరియు జగదపట్టినం తీర గ్రామాల నుండి రెండు వేర్వేరు బోట్లలో బుధవారం రాత్రి వీరు చేపలవేటకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. మత్స్యకారులు 'నెడుంతీవు' సమీపంలో చేపటవేట సాగిస్తున్న సమయంలో అక్రమంగా చొరబడ్డారన్న అరోపణలపై శ్రీలంక నేవీ అరెస్ట్ చేశారని, విచారణ నిమిత్తం కంకేసంతురై నేవల్ బేస్‌కు తరలించినట్లు కోస్టల్ సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వారిలో కొట్టెపట్నంకి చెందిన నలుగురు మత్స్యకారులు ఎన్.అరుణ్, కె.సుందరమ్, ఎస్.సెల్వరాజ్, జి.మరుదు అలాగే జగదపట్టినంకి చెందిన కేశవన్, ముత్తు, గుణ, మురుగేశన్, కుమార్‌లు ఉన్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.