ప్రజాశక్తి - చాపాడు : వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయం, వైద్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే ఎస్ రఘురామి రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పెద్దగురువలూరు గ్రామంలో రూ. 23.94 లక్షలతో నూతనంగా నిర్మించిన ఆర్ బికే, రూ.20.30 లక్షల తో నిర్మించిన హెల్త్ క్లినిక్ భవనాలను సోమవారం సర్పంచ్ రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను అమలుపరిచి సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను అన్ని రకాల హంగులతో నిర్మిస్తుందన్నారు. రైతులకు కావలసిన ఎరువులు, మందులు ఆర్బికెలలో అందుబాటులో ఉంటున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అన్ని గ్రామాలకు రహదారులను పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, ఎంపీపీ లక్ష్మయ్య, ఎంపీడీఓ శ్రీధర్ నాయుడు, తహశీల్దార్ యామిని, పంచాయతీరాజ్ ఏఈ ఈశ్వరయ్య, జిల్లా వక్స్ బోర్డ్ చైర్మన్ మదీనా దస్తగిరి, వైసిపి నాయకులు రామ్మోహన్ రెడ్డి, వేమారెడ్డి,ఓబుళ రెడ్డి, సివి సుబ్బారెడ్డి, నాగిరెడ్డి, బలోరో బాషా, పంచాయతీ కార్యదర్శులు శ్రీనువాసుల రెడ్డి, ధనేశ్వర్ బాబు , సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










