- అధ్యక్షులుగా నవీన్ రాజ్, కార్యదర్శిగా లక్ష్మణ్, కోశాధికారిగా అధికార్
ప్రజాశక్తి-కాకినాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యుజేఎఫ్) కాకినాడ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా వాతాడ నవీన్ రాజ్, (స్వతంత్ర్య న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్), కార్యదర్శిగా ముమ్మిడి లక్ష్మణ్ (ప్రజాశక్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్), కోశాధికారిగా ఎండి అధికార్ లు ఎన్నికయ్యారు. ఫెడరేషన్ కాకినాడ జిల్లా తొలి మహాసభ ఆదివారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర నాయకుల సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా గత కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణను రూపొందించారు. నూతన కమిటీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా సిహెచ్ వివి సత్యనారాయణ (బాబీ) (ఆంధ్రజ్యోతి, కాజులూరు) మీడియా సెక్రెటరీగా పుర్రె త్రినాథ్ (తూర్పు వాణి ఎడిటర్, కాకినాడ), లీగల్ అడ్వైజర్ గా టి. పృథ్వీరాజ్ (కాకినాడ), ఉపాధ్యక్షులుగా నాయుడు (ఆంధ్రజ్యోతి, జగ్గంపేట), జి.శోభన్ బాబు (వార్త, కరప), ఎంవి రమణ (సాక్షి,యు. కొత్తపల్లి), వీధి గోపీనాథ్ ( న్యూస్ ఛానల్, కాకినాడ), బోట్ల లోవరాజు (జన ప్రతిధ్వని, శంఖవరం) ఆనంద్ (స్వతంత్ర్య, పెద్దాపురం) బిందాన సురేష్ ( ఉదయ అక్షరం, కాకినాడ రూరల్), సహాయ కార్య దర్శులుగా రామకృష్ణ (సాక్షి, ప్రత్తిపాడు), సురేంద్ర (వైఎన్ సీ టివి, పెద్దాపురం), అలమండ ప్రసాద్ (జనస్పందన, సామర్లకోట), ఎస్. మాధవ్ (పెన్ పవర్, ఏలేశ్వరం), కె. సత్య (ఇమేజ్ న్యూస్, పిఠాపురం), గుత్తుల మల్లేశ్వరరావు (ప్రజాశక్తి, తాళ్లరేవు) ఎన్నికయ్యారు. అలాగే సభ్యులుగా అశోక్ (99 టీవీ, పెద్దాపురం), కొత్తపల్లి రాంబాబు, వి. స్టాలిన్ ( వై న్యూస్, పిఠాపురం), నానాజీ ( స్వతంత్ర్య, కాకినాడ), బత్తిన తాతాజీ (దిశ, శంఖవరం), హసేన్ ( సిటీ కేబుల్, కాకినాడ), మదన్ (డి2, కాకినాడ), ఏ. ప్రసాద్ (ప్రజాభూమి, రౌతులపూడి) లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు










