ప్రజాశక్తి-కర్నూల్ స్పోర్ట్స్ : క్రీడల్లో రాణించేవారికి ప్రోత్సహిస్తామని జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాస్ అన్నారు నగర శివారులలోని పార్థసారధి నగర్ వైయస్సార్ పార్క్ లో ఏర్పాటు చేసిన తెక్వండో బెల్ట్ టెస్ట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై యారు. ఆరెంజ్, ఎల్లో బెల్ట్ లను ప్రధానం చేశారు. టైక్వాండలో ప్రతిభ కనబరిచి క్రీడాకారులకు మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యతో పాటు క్రీడల్లో రానిచ్చే క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ప్రాధాన్యత లభిస్తుందని తెలియజేశారు. కాలనీ క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు ముందుంటామిని తెలియజేశారు. అనంతరం ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పథకాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో ప్రధాన శిక్షకులు రాంబాబు, శిక్షకులు శివ తదితరులు పాల్గొన్నారు.










