Oct 13,2023 19:22

దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రామదూత క్రియేషన్స్‌ బ్యానర్‌లో దాసరి కిరణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న సినిమా 'వ్యూహం'. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్‌, వైఎస్‌ భారతి పాత్రలో మానస నటిస్తున్నారు. నవంబర్‌ 10న ఈ సినిమా విడుదల కానుంది. ట్రైలర్‌ను శుక్రవారంనాడు విడుదల చేశారు. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడారు. 'నేను డైరెక్ట్‌ చేసే సినిమాలన్నింటిలో 80శాతం ఏదో ఒక ఇన్సిడెంట్‌ ఇన్సిపిరేషన్‌తోనే రూపొందిస్తాను. పదేళ్ల క్రితం కీర్తిశేషులు అప్పటి సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయినప్పుడు జరిగిన సంఘటనలు నాకు ఈ సినిమా చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి' అని పేర్కొన్నారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యూహంతోపాటుగా శపధం సినిమాను కూడా చేస్తున్నామన్నారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేస్తామని వివరించారు.