
ఉత్తర ప్రదేశ్ హత్రాస్ జిల్లాలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన మనీషా ఘటన దేశమంతా పెను సంచలనం రేపింది. మహిళలైతే చాలు పసిబిడ్డ నుంచి పండు ముదుసలి వరకూ ఎక్కడో ఒకచోట హత్యాచారాలకు, లైంగిక హింసకు, ఆకృత్యాలకు గురవుతూనే ఉన్నారు. స్త్రీ ఆకాశంలో సగమనే మాటలు నీటిమీద రాతలేనా? పురుషాధిక్య సమాజంలో స్త్రీకి రక్షణ కరువేనా? అంటే నిజమే! అని నిరూపించే ఎన్నో సంఘటనలు మన ముందున్నాయి.
దేశం 'నిర్భయ' సంఘటనను ఇంకా మరచిపోలేదు. కాశ్మీర్ పసి పాప 'ఆసిఫా'ను మరచిపోలేదు. హైద్రాబాద్ 'దిశ' సంఘటనను మరచిపోలేదు. నిర్భయలాంటి చట్టాలు వచ్చినా దేశంలో స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల మానసపై జరిగిన లైంగిక దాడి మరోసారి దేశం ఉలిక్కిపడేలా చేసింది.
రోజుకు 87 అత్యాచారాలు
'నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో' తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం 2018 కంటే 2019లో స్త్రీలపై నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. దేశంలో మొత్తం 4,05,481 స్త్రీ సంబంధిత నేరాలు నమోదయ్యాయి. వీటిలో భర్త, బంధువుల వేధింపులకు గురైనవి 30 శాతం, స్త్రీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే కేసులు 21.8 శాతం, కిడ్నాప్, అపహరించడం 17.9 శాతం, అత్యాచారాలు 7.9 శాతం ఉన్నాయి. దేశంలో గతేడాది రోజుకు సగటున 87 అత్యాచారాలు నమోదయ్యాయి. ప్రపంచ గణాంకాలను చూస్తే 91.6 శాతం అత్యాచార కేసులు నమోదు కాలేదని తెలుస్తోంది. అంటే ఇప్పుడు చెప్పుకుంటున్న అంకెలు 8 శాతం బాధి తుల నుంచి నమోదైనవిగా అర్థం. దీని ప్రకారం దేశంలోని ప్రతి లక్షమంది స్త్రీలలో 62 మంది ఏదో ఒక రకంగా వేధింపులకు గురవుతున్నారు.
స్త్రీలపై జరిగిన అన్ని నేరాలను పరిగణ నలోకి తీసుకుంటే 2019 లో ఉత్తరప్రదేశ్ దాదాపు 60 వేల కేసులతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి వరుసలో రాజస్తాన్, మహారాష్ట్ర, అసోం నిలుస్తున్నాయి. ఇక లైంగిక దాడికి సంబంధించి దేశంలో రాజస్తాన్ మొదటి స్థానంలో ఉంది. అక్కడ గత సంవత్సరం దాదాపు ఆరువేల లైంగిక దాడులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే హర్యానా లైంగిక దాడుల విషయంలో ప్రమాదకర రాష్ట్రంగా నిలిచింది.
యాసిడ్ దాడులు
గతేడాది ఉత్తరప్రదేశ్‌లో 42, పశ్చిమ బంగాలో 36 యాసిడ్ దాడులు జరిగాయంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో దేశం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. గతేడాది అక్కడ ఏడున్నర వేల పోస్కో కేసులు నమోదయ్యాయి. దీని తర్వాతి స్థానంలో మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం, హర్యానా ఉన్నాయి. గతంతో పోలిస్తే స్త్రీలలో చైతన్యం వచ్చిందని చెప్పు కోవచ్చు. సమాజంలో స్త్రీని గౌరవించే వాతా రణం, కుటుంబంలో స్త్రీకు ఇచ్చే మర్యాద, పని ప్రదేశాల్లో ఆమెకు దక్కాల్సిన గౌరవం, భావజా లంలో మార్పు ఇవన్నీ మార్పును తెచ్చే విష యాలు. పురోగామి దృక్పథమే ఇప్పుడు కావల సింది. బాధిత కుటుంబాలపై జాలిచూపి ఆగిపో వద్దు. బాధితులకు న్యాయం జరిగే వరకూ ప్రతి ఒక్కరం అండగా ఉండటం మన ప్రధమ కర్తవ్యం.
మానస ఆసుపత్రిలో మాట్లాడిన వీడియోలో కొంతభాగం
ఆమె : (వినిపించలేదు)
ఆమె : మునుపూ ఒకసారి..
మగ గొంతు : మునుపు కూడా ఒకసారి అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారా?
ఆమె : హా..ఆ అన్నదమ్ములే.. (హా..వో భాయియో నె)
మగ గొంతు : ఇంతకు ముందా?
ఆమె : హా...
మగ గొంతు : అచ్చా.. దీనికి ముందు అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించారా?
ఆమె : హా...
మగ గొంతు : మరేమయ్యింది?
ఆమె : నేనక్కడ్నుంచీ పారిపోయా.
మగ గొంతు : పారిపోయొచ్చావా? మళ్ళేమయ్యింది?
ఆమె : రవి నన్ను చూస్తూ ''ఏమన్నా అయిందా?'' అన్నాడు.
మగ గొంతు : ఏమన్నా అయిందా? లేదా?
ఆమె : సందీప్‌ను అడుగు .. (రవిని ఉద్దేశించి సందీప్‌ను అడుగు అన్నాను అని)
మగ గొంతు : అచ్చా
ఆమె : ''... ఫోన్ చేసి'' (రవితో ఏమన్నదో చెబుతోంది..)
మగ గొంతు : అచ్చా
ఆమె : హా...
మగ గొంతు : రవి అడుగుతూ వున్నాడా ''ఏమన్నా అయిందా లేదా'' అని?
ఆమె : అవును, అప్పుడర్థం అయింది, వారిద్దరూ పథకంలో భాగమఁ..
మగ గొంతు : అచ్చా
ఆమె : హా...
మగ గొంతు : వాళ్ళిద్దరూ కలిసే చేశారు?
ఆమె : హా...
మగ గొంతు : అప్పుడు బయట పడ్డావు. తర్వాతేమయ్యింది?
ఆమె : మళ్ళీ మొన్నయింది.
మగ గొంతు :: మొన్న నువ్వు గాయపడ్డ రోజు, అత్యాచారం అయ్యిందా?
ఆమె : హా...
మగ గొంతు : అచ్చా, వాళ్ళిద్దరేనా, ఇంకెవరైనా వున్నారా?
ఆమె : వాళ్ళిద్దరూ వున్నారు...ఇంక మిగిలినోళ్ళు పారిపొయ్యారు.
మగగొంతు : అచ్చా, మిగిలినోళ్ళు పారిపోయ్యారా!
ఆమె : మా మమ్మీని చూసి...
మగగొంతు : మమ్మీని చూసి పారిపొయ్యారా?
ఆమె : హా..
మగ గొంతు : మీరప్పుడు తెలివిలోనే వున్నారా?
ఆమె : కొద్దిగా తెలివుండింది
మగ గొంతు : కొద్దిగ తెలివిలోనే వున్నారు?
ఆమె : హా...
మగ గొంతు : మిమ్మల్ని అత్యాచారం చేసారా? (తో రేప్ హువా హై ఆప్ కె సాత్?)
ఆమె : హా...
మగ గొంతు : ఆ తర్వాత ఏమయ్యింది?
ఆమె : తర్వాత మమ్మీ నోట్లో నీళ్ళు పోసింది, ఏమయింది అని అడగబట్టింది...