తాడేపల్లి రూరల్ (దుగ్గిరాల) : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంతూరిలో వైసిపి గెలుపొందింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో సర్పంచ్, ఆయన గఅహం ఉన్న వార్డులో కూడా వైసిపి అభిమానులు గెలుపొందారు. గ్రామ సర్పంచ్ పదవిని బాలావర్తు కుషీబాయి 1,169 ఓట్ల భారీ మెజారిటీతో గెల్చుకున్నారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సొంత వార్డులో వైసిపి అభిమాని ఆత్మకూరు నాగేశ్వరరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 490 ఓట్లు పోలవగా నాగేశ్వరరావుకు 256 ఓట్లు వచ్చాయి. టిడిపి మద్దతుదారుకు 145 ఓట్లు పోలయ్యాయి.










