Dec 12,2022 13:07

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : నిమ్మగడ్డ ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి సిపిఎం కార్యకర్తలు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ ఎస్‌ చెంగాయ్య అన్నారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, సిపిఎం నాయకులు నిమ్మగడ్డ రామ్మోహన్‌ రావు 14వ వర్ధంతి సందర్భంగా ... సోమవారం గౌతమ్‌ బుద్ధ రోడ్ల వద్ద ఉన్న నిమ్మగడ్డ విగ్రహానికి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెంగయ్యా మాట్లాడుతూ .. సమితి అధ్యక్షులుగా 70 గ్రామాల్లో రైతులకు లింక్‌ రోడ్లను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ప్రతి దళితవాడలోనూ పాఠశాలలను నిర్మించామన్నారు. ప్రజా ప్రతినిధిగా, సిపిఎం నాయకులుగా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిమ్మగడ్డ చేసిన కృషి మరువలేనిది అని తెలిపారు. నిమ్మగడ్డ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి.రాఘవులు, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకఅష్ణ, జిల్లా కార్యదర్శి డి.రామారావు, ఆటో డ్రైవర్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నన్నపనేని శివాజీ, రైతు సంఘం మండల కార్యదర్శి టి.ప్రసాద్‌ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.బాలాజీ, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.గణేష్‌, తదితరులు పాల్గొన్నారు.